ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను.. ఎంతో ప్రేమతో మాట్లాడేవారు: సచిన్ 

  • రిషి కపూర్ మరణ వార్త ఎంతో బాధను కలిగించింది
  • ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
సినీ నటుడు రిషికపూర్ మరణ వార్త ఎంతో బాధను కలిగించిందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపాడు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలను చూస్తూ పెరిగానని చెప్పాడు. ఇన్నేళ్లలో ఆయనను ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేవారని తెలిపాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించాడు. నీతు, రణ్ బీర్ కపూర్, రిద్ధిమా కపూర్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ, రిషి కపూర్ చనిపోయారనే వార్తను నమ్మలేకపోతున్నానని చెప్పాడు. దిగ్గజం చనిపోయారనే  విషయాన్ని అంగీకరించడం కష్టమని తెలిపాడు. నిన్న ఇర్ఫాన్ ఖాన్, ఈరోజు రిషి కపూర్... చాలా గొప్ప వ్యక్తులను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. రిషి కపూర్ మరణ వార్త తన గుండెను కలచివేస్తోందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

Rishi Kapoor
Bollywood
Sachin Tendulkar
Virat Kohli
Virender Sehwag

More Telugu News